కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో పక్షుల సమస్య తీవ్రమవుతోంది. రన్వే చుట్టుపక్కల చెత్త, ఆహార వ్యర్థాలు వేయడం వల్ల కాకులు, కొంగలు వంటి పక్షులు భారీగా చేరుతున్నాయి. దీనివల్ల విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇటీవల ఓ విమానాన్ని పక్షి ఢీ కొనడంతో ఆ సర్వీస్ రద్దయింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది కోరుతున్నారు.
జిల్లా పోలీసు శాఖను మరింత బలోపేతం చేసేందుకు శనివారం నూతన జాగిలం ‘హంటర్’ పోలీసు శాఖకు చేరింది. నేరాల ఛేదనలో, నేరస్థులను పట్టించడం, పేలుడు పదార్థాల గుర్తింపులో 10 నెలల శిక్షణ పొందిన హంటర్ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌ను బలోపేతం చేస్తుందని, ప్రస్తుతం స్క్వాడ్ సంఖ్య 9కు పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
PPM: ఎయిడ్స్, హెచ్.ఐ.వి అవగాహనలో భాగంగా ఈ నెల 9వ తేదీన రెడ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా లెప్రోసి, ఎయిడ్స్, హెచ్.ఐ.వి, టిబి నియంత్రణ అధికారి డా.ఎం వినోద్ కుమార్ తెలిపారు. ఈమేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. 9వ తేదీ ఉదయం 6 గంటలకు శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి రన్ ప్రారంభం అవుతుందని తెలిపారు.
E.G: రాష్ట్ర గ్రీనింగ్ & బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన నర్సరీ రైతు వడగల వీర వెంకట బుచ్చిరాజు రాజమండ్రిలోని జనసేన కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్‌ను శనివారం కలిశారు. రాష్ట్రానికి పర్యావరణ పరిరక్షణ & సుందరీ కరణ రంగాలలో బుచ్చిరాజు విశేష అనుభవంతో కృషి చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని మంత్రి సూచించారు.
కృష్ణా: ఆ గణనాధుని ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉయ్యూరులోని 2, 7,15 వార్డుల్లో ఏర్పాటు చేసిన గణపతి మండపాలను అయన సందర్శించారు. అంగరంగ వైభవంగా గణేష్ చతుర్థి ఉత్సవాలు చేయడం ఆనందదాయకమని అన్నారు. ఆ గణనాధుని ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు.
AKP: నర్సీపట్నం మండలం ధర్మసాగరం గ్రామంలో శనివారం డ్రోన్ ద్వారా నానో యూరియా పిచికారి కార్యక్రమం మీద రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారిని విజయలక్ష్మి మాట్లాడుతూ.. డ్రోన్ ద్వారా నానో యూరియా పిచికారి చేయడం వల్ల పంట దిగుబడి రావడానికి అవకాశం ఉందన్నారు. సబ్సిడీ ద్వారా డ్రోన్లను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అందిస్తున్నమని తెలిపారు.
GNTR: సీఎం చంద్రబాబు రైతులను బెదిరిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఈ సమస్యపై ఈనెల 9న ‘అన్నదాత పోరు’ పేరిట ఆర్డీవో కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. గుంటూరులో సంబంధించిన పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు.
కృష్ణా: రాష్ట్రంలో ఇమామ్, మౌజ్జాన్‌లకు తక్షణమే పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు శనివారం డిమాండ్ చేశారు. వైసీపీ స్టేట్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాదర్ భాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్ పిలుపుమేరకు సెప్టెంబర్ 8 ఉదయం 10 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టరేట్ల వద్ద వినతిపత్రాలు సమర్పించాలని తెలిపారు.
అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలో కొత్తకోట కొత్త పెట్రోల్ బంకు వద్ద భారీ గొయ్యిలు ఏర్పడ్డాయి. ఈ గొయ్యిల్లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వినూత్నంగా చేపల వేట చేసి నిరసన తెలియజేశారు. నల్లరాయి క్వారీల నుంచి గ్రానైట్ను తరలిస్తూ భారీ వాహనాలతో 60 టన్నుల బరువును బియన్ రోడ్డుపై వెళ్లడానికి పర్మిషన్ లేకపోయినా అధికారులు పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
కృష్ణా: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల తర్వాత సెప్టెంబర్ 6న మచిలీపట్నంలో ఘనంగా ముగిశాయి. బీచ్ సహా పలు చెరువుల వద్దకు గణేశ్ విగ్రహాలను శోభాయాత్రల రూపంలో తీసుకెళ్లి, డప్పులు, భజనలు, బాజాలతో “గణపతి బప్పా మోరియా” నినాదాలతో భక్తులు భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు, మున్సిపల్ శాఖలు బీచ్ వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేశారు.
కోనసీమ: మండపేట శ్రీ వేగుళ్ళ సూర్యారావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఇ. సమర్పణ కుమార్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా CM నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు అవార్డు అందజేశారు. ఈయనకు అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
VSP: దేవాలయాల్లో భక్తుల సౌకర్యాలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు తెలిపారు. పెదవాల్తేరు లాసన్స్ బే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార వేడుకలో ఆయన పాల్గొన్నారు. కొత్తగా నియమితులైన సభ్యులు భక్తుల సదుపాయాల మెరుగుదలపై దృష్టి పెట్టాలని కోరారు.
NTR: ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి మూసివేయబడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 3:00 గంటల నుంచి ఉదయం 8:30 వరకు ఆలయ శుద్ధి, స్నపనాభిషేకం, అర్చన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత, ఉదయం 8:30 గంటల నుంచి భక్తులకు దర్శనాలు పునఃప్రారంభమవుతాయి.
CTR: విజయపురం మండల కేంద్రం నందు విద్యాశాఖ అధికారులు శ్యామల, హరిప్రసాద్ వర్మ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ కిరణ్ మాట్లాడుతూ.. అన్ని వృత్తుల వారిని తయారుచేసే వారు ఉపాధ్యాయులని ఉపాధ్యాయ వృత్తి దైవంతో సమానమని పేర్కొన్నారు. ఏంపీడీవో రాజేంద్రన్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు అని పేర్కొన్నారు.