• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వినాయక విగ్రహాల నిమర్జనాలు సాఫీగా సాగేందుకు చర్యలు

E.G: కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలో వినాయకుడి విగ్రహాల నిమజ్జనాలు సాఫీగా కొనసాగేందుకు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సీఐ పీ.విశ్వం తెలిపారు. గోష్పాద క్షేత్రంలో ప్రత్యేక క్రేన్, అగ్నిమాపక శకటాన్ని అందుబాటులో ఉంచామన్నారు. ఇప్పటి వరకు 115 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు, ఈరోజు ముగింపు రోజు కావడంతో 50 విగ్రహాలు వచ్చే అవకాశం ఉందన్నారు.

September 6, 2025 / 12:25 PM IST

నూతన భవనాలు ప్రారంభించిన పెడన ఎమ్మెల్యే

కృష్ణా: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సమర్థవంతంగా అమలు చేస్తోందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. బంటుమిల్లి మండలం మణిమేశ్వరంలో 60 వేల లీటర్ల సంపు, రూ.43.60 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయితీ భవనం, రూ.23.94 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్ర భవనం ప్రారంభించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

September 6, 2025 / 12:23 PM IST

వామ్మో.. ఎంత పెద్ద అస్థిపంజరమో..!

ప్రకాశం: దేశంలోనే పూర్తిస్థాయి స్పెర్మ్ వేల్ అస్థిపంజరం ఒంగోలులోని సీఎస్ఆర్ శర్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని జంతుశాస్త్ర ప్రయోగశాలలో ఉంది. 1983, డిసెంబర్ 9న పెదగంజాం తీరానికి కొట్టుకొచ్చిన 35 అడుగుల పొడవు, 30 టన్నుల బరువున్న ఈ తిమింగలం కళేబరాన్ని విద్యార్థుల అవగాహన కోసం కళాశాలకు తరలించారు. దీన్ని ప్రభుత్వం సంరక్షించాలని అధ్యాపకులు కోరుతున్నారు.

September 6, 2025 / 12:19 PM IST

నూతన ఏటీఎంను ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: రాజమండ్రి నగరంలోని కోటగుమ్మం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్యాపురం కో-ఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎంను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు ఏటీఎం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఏటీఎం సేవల్లో అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

September 6, 2025 / 12:17 PM IST

గిరిజన ఆశ్రమ పాఠశాలల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

SKLM: రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. శనివారం సరుబుజ్జిలి మండలం వెన్నెల వలస వద్ద ఉన్న గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి గాను శంకుస్థాపన చేశారు. దీనికోసం రూ. 4 కోట్ల 36 లక్షల రూపాయలు నిధులు కేటాయించామని అన్నారు.

September 6, 2025 / 12:17 PM IST

నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: ఫిరోజ్

ప్రకాశం: ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, కనిగిరి మున్సిపాలిటీలో టీడీపీ బోలోపేతానికి కృషి చేస్తానని టీడీపీ కనిగిరి పట్టణ నూతన అధ్యక్షులు షేక్ ఫిరోజ్ అన్నారు. కనిగిరి టీడీపీ అధ్యక్షునిగా నియమితులైన ఫిరోజ్‌ను శనివారం పలువురు టీడీపీ కార్యకర్తలు కలిసి అభినందించారు. టీడీపీ బలోపేతంపై ఫిరోజ్ వారితో చర్చించారు.

September 6, 2025 / 12:15 PM IST

ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాలకు 24 కుర్చీల వితరణ

TPT: చిన్నబజారు స్ట్రీట్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో భీమా జ్యూవెల్స్ సంస్థ 24కుర్చీలను అందజేశారు. శనివారం పాఠశాలలో టీచర్స్, విద్యార్థుల సమక్షంలో కుర్చీలను అందజేశారు. టీచర్స్ డే సందర్భంగా భీమా జ్యూవెల్స్ తరఫున 24కుర్చీలు, టీచర్లకు చిరు కానుకలు అందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. టీచర్లు, విద్యార్థులు భీమా జ్యూవెల్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.

September 6, 2025 / 12:09 PM IST

జంబుకేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన ఎండోమెంట్ ఇన్‌స్పె క్టర్

ATP: రాయదుర్గం పట్టణంలోని కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ రాణి సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కొత్తగా ఎన్నికైన పాలకమండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. జంకేశ్వర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు.

September 6, 2025 / 12:08 PM IST

గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రకాశం: పొన్నలూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నమని కాలేజీ ప్రిన్సిపాల్ రాజేంద్రబాబు తెలిపారు. ఫిజిక్స్ బోధనకు 50% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 9 తేదీకి పూర్తి అర్హత పత్రాలతో దరఖాస్తులు సమర్పించాలన్నారు.

September 6, 2025 / 12:08 PM IST

కుక్క దాడిలో వ్యాపారికి తీవ్ర గాయాలు

ATP: గుత్తి జెండా వీధిలో వ్యాపారి గోపిపై శనివారం కుక్క దాడి చేసింది. ఇంటి ఆరు బయట నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక వైపు నుంచి కుక్క ఒకసారిగా దాడి చేసి గాయపరిచింది. ఈ దాడిలో గోపికి గాయాలయ్యాయి. బాధితుడు మాట్లాడుతూ.. జెండా వీధిలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని చెప్పాడు. అధికారులు స్పందించి కుక్కల బెడద లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.

September 6, 2025 / 12:08 PM IST

రొద్దంలో వినాయకుని లడ్డు రూ.1,10,116

సత్యసాయి: రొద్దం మండలంలో వినాయకుని విగ్రహం వద్ద శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరి రోజు సందర్భంగా కమిటీ సభ్యులు వినాయకుడి లడ్డు వేలం పాట నిర్వహించారు. శేషాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు అరుణ్ కుమార్ రెడ్డి రూ.1,10,116 కు వేలం పాడి స్వామి వారి లడ్డును దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను కమిటీ సభ్యులు ఆయనను సన్మానించి లడ్డును అందజేశారు.

September 6, 2025 / 12:05 PM IST

ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి

ప్రకాశం: కొనకనమిట్ల మండలం గొట్లగట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైద్యశాలలోని పలు విభాగాలను పరిశీలించి, రోగులతో వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం సిద్ధవరం, పెద్దారికట్ల విలేజ్ క్లినిక్ సెంటర్లను సందర్శించి రికార్డులను పరిశీలించారు.

September 6, 2025 / 11:58 AM IST

గుంతలతో ఇబ్బందులు

VSP: గురుద్వార జంక్షన్ బస్టాప్ పరిసరాల్లో రహదారి దెబ్బతింది. ప్రతి రోజు వందలాది మంది ప్రయాణించే ఈ మార్గంలో పెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు పడేటప్పుడు గుంతల నీటితో నిండిపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

September 6, 2025 / 11:57 AM IST

NIRFలో విజ్ఞాన్ యూనివర్సిటీకి 70వ ర్యాంక్

GNTR: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ గురువారం విడుదల చేసిన 2025వ సంవత్సర ఉన్నత స్థాయి NIRFలో విజ్ఞాన యూనివర్సిటీకి 70వ ర్యాంక్ లభించింది. ఈ విషయాన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ నాగభూషణ్ శనివారం తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో కూడా 80 ర్యాంక్ సాధించినట్లు చెప్పారు. ర్యాంక్ రావడానికి కృషి చేసిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

September 6, 2025 / 11:55 AM IST

రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ నియామకం

W.G: రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నరసాపురానికి చెందిన కొలచన శ్రీపద్మ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ పద్మ ప్రస్తుతం నరసాపురం పట్టణ టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. సీఎం చంద్రబాబు తనపై నమ్మకంతో ఇచ్చిన పదవికి పూర్తి న్యాయం చేస్తానని, బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.

September 6, 2025 / 11:55 AM IST