VZM: బొండపల్లి మండలంలోని కిండాం అగ్రహారం సర్పంచ్ బుంగ దేవుడు శనివారం మృతి చెందారు. దేవుడుకి తెల్లవారుజామున గుండెపోటు రావడంతో చికిత్స కోసం విజయనగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దేవుడు మృతి చెందాడు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేశారు.
ELR: TDP రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు శనివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. వీరభద్రవరంలో అనారోగ్యానికి గురైన సాయిల శ్రీనుకు రూ.42 వేలు, ఎర్ర గొర్ల సుబ్బారావుకు రూ.84 వేల చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లుకుంట PACS అధ్యక్షుడు శీలం సాయి వినయ్, సర్పంచ్ నయనారపు జలపాలు ఉన్నారు.
ఎన్టీఆర్: నందిగామ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు డొమిస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, టైలరింగ్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈనేపథ్యంలో మహిళలు ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
సత్యసాయి: పెనుకొండ మండలం కొండపల్లి వద్ద ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి దివంగత రామచంద్రారెడ్డి 82వ జయంతి కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొని తన తండ్రి సమాధికి గజమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన తండ్రి జ్ఞాపకాలను మంత్రి నెమరెసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ.. తన తండ్రి రామచంద్రారెడ్డి ఆశయాలను కొనసాగిస్తానని తెలిపారు.
GNTR: రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం సమీపంలో ఉన్న టీటీడీ దేవస్థానంలో వేంకటేశ్వరస్వామిని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శనివారం దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అర్చకులు కన్నాకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి ఆశీర్వచనాలు ఎమ్మెల్యేకు అందజేశారు. అమరావతిలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
PPM: ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణంలోప్రైవేట్ భాగస్వామ్య నిర్ణయాన్ని సీపీఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎం.కృష్ణమూర్తి అన్నారు. ప్రభుత్వ వైద్య రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని జోడిస్తూ టీడీపీ క్యాబినెట్ చేసిన నిర్ణయాన్ని పార్టీ నాయకులు శనివారం పార్వతీపురం సుందరయ్య భవనం నుంచి ర్యాలీ చేశారు.
NLR: నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక జేమ్స్ గార్డెన్, వెంకట్రామాపురం ప్రాంతంలో జరుగుతున్న భవనాల డెమోలిషన్ పనులను శనివారం తనిఖీ చేశారు. భవనాల డెమోలిషన్ సమయంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించాడు. పరిసర ప్రాంతాల వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులను పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
చిత్తూరు: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్, సీడాప్ డీఆర్డీఏ సంయుక్తంగా ఈనెల 10వ తేదీన కార్వేటినగరం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించబడుతుందని ఐటీఐ ప్రిన్సిపాల్ ఆనంద్ తెలిపారు. మేళాలో 12 కంపెనీలు పాల్గొంటాయి. టెన్త్, ఇంటర్, ITI, డిగ్రీ ఫెయిల్/పాస్ అయిన 18 నుంచి 35ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు హాజరు కావచ్చన్నారు.
NLR: నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక మినీ బైపాస్ ప్రాంతంలోని ఎన్టీఆర్ పార్కును శనివారం సందర్శించారు. పార్కులోని వసతులు, సందర్శకులకు అందుతున్న సౌకర్యాలను కమిషనర్ పరిశీలించారు. అనంతరం పార్కు పరిసర ప్రాంతాలలో పాదచారుల మార్గాన్ని ఆక్రమిస్తూ ఏర్పాటు చేసిన దుకాణాలను కమిషనర్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
CTR: పుంగనూరులో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రిటైర్డ్ డీఎస్పీ సుకుమార్ బాబు ఆలయం వద్ద భిక్షగాళ్లకు ఇవాళ వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఏడు శనివారాలు స్వామివారిని పూజించగా మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. గత ఏడు వారాలుగా ప్రతి వారం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
ప్రకాశం: కొమరోలు ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రంలో ఎక్స్‌రే మిషన్ ఉన్నప్పటికీ పేషెంట్లకు అందుబాటులో లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం ఎక్స్‌రే మిషన్ మరమత్తులకు గురికావడంతో ఓ గదిలో ఉంచి తాళం వేశారు. మిషన్‌కు అధికారులు మరమ్మతులు చేపించకపోవడంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు ఎక్స్‌రే సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
ATP: ఉరవకొండ మండలం లత్తవరం తండా గ్రామానికి చెందిన మహేష్ నాయక్ అనే విద్యార్థి ఈనెల 2న అదృశ్యమయ్యాడు. ఈ విద్యార్థి వజ్రకరూరు మండలం రాగులపాడు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. చుట్టుపక్కల ప్రాంతాలలో గాలించిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కృష్ణా: ఘంటసాల మండలం తాడేపల్లి పెద్ద ఆశ్రమంలో ప్రారంభించే వేదపాఠశాలకు ఆశీస్సులు అందించాలని శ్రీ బాల పార్వతీ సమేత శ్రీ జలదీశ్వరస్వామి వార్లను జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కృష్ణమూర్తి దర్శించుకున్నారు. శనివారం ఉదయం స్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి చిత్రపటలను అందజేశారు.
GNTR: కేంద్ర సహాయమంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ జిల్లా స్థాయి బ్యాంకర్‌ల సమావేశం శుక్రవారం ఏర్పాటు చేశారు. కలెక్టర్ నాగలక్ష్మీ అధ్యక్షతన శంకరన్ కాన్ఫరెన్స్ హాలులో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన బ్యాంకర్‌ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు రుణాలు అందజేసి అందరూ స్వశక్తితో ఎదిగేలా బ్యాంకర్‌లు కృషి చేయాలని సూచించారు.
కృష్ణా: పెడన మండలానికి 215 టన్నుల యూరియా స్టాక్ చేరుకుందని మండల వ్యవసాయ అధికారిణి జెన్నీ శనివారం తెలిపారు. కమలాపురం, కవిపురం, చేవెండ్ర, పెడన, కొంకేపూడి, నందమూరు, పెనుమల్లి, మచెర్ల, నందిగామ, దావోజిపాలెం గ్రామాల్లో రైతులు యూరియాను పొందవచ్చని ఆమె సూచించారు. మిగిలిన గ్రామాలకు ఆదివారం స్టాక్ అందుబాటులోకి వస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.