PLD: జిల్లా ఆట్యా-పాట్యా అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ జట్ల ఎంపిక పోటీలు నేడు నకరికల్లులో జరుగుతాయని జిల్లా కార్యదర్శి రోహిత్ జోయల్ తెలిపారు. స్థానిక వంగ వెంకట్ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎంపికైన జట్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తాయన్నారు.