KDP: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సూచించారు. ఇందులో భాగంగా ఆదివారం స్థానిక అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు ఈద్గా మైదానంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెట్లు మానవాళిని రక్షిస్తాయన్నారు. ముస్లింలు సోదరులకు ప్రార్థనలు చేయడానికి చెట్లు నీడనిస్తాయన్నారు.