వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 342 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ 414 పరుగులు చేయగా, సౌతాఫ్రికా 72 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ గెలుపుతో, వన్డే చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు శ్రీలంకపై భారత్(317) పేరిట ఉండేది.