KNR: విహారయాత్రకు వచ్చిన పర్యాటకులపై తేనెటీగలు దాడి చేయడంతో 30 మంది గాయపడ్డారు. ఈ ఘటన శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కరీంనగర్‌కు చెందిన దాదాపు 30 మంది కుటుంబాలు పర్యటన కోసం గ్రామంలోని దూద్ బావి వద్దకు వెళ్లారు. అక్కడ వంట చేసుకుంటున్న సమయంలో సమీపంలోని మర్రిచెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా వారిపై దాడి చేశాయి.