WNP: వనపర్తి మండలం పెద్దగూడెంలోని ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ప్రతిష్ఠించిన గణనాథుని నిమజ్జన వేడుకలు వైభవంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం జరిగిన లడ్డూ వేలంలో గ్రామానికి చెందిన గుండాల సురేష్ రూ.30 వేలకు గణపతి లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం డప్పు వాయిద్యాలు, భజనలతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు.