NZB: సిర్నాపల్లి జానకీబాయ్ అలుగు జలపాతం వద్ద ప్రకృతి ప్రేమికులు సందడి చేస్తున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున ప్రకృతి అందాలను తిలకించేందుకు ప్రజలు జలపాతం వద్దకు తరలి వచ్చారు. ప్రస్తుతం వీకెండ్ స్పాట్‌గా ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోన్న ఈ ప్రాంతం అందాలను మాటల్లో వర్ణించలేమంటే అతిశయోక్తి కాదు.