HNK: ఆదివారం వరంగల్లో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగినందుకు పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు, గణేష్ ఉత్సవాల నిర్వాహకులకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. శోభాయాత్రను విజయవంతం చేయడంలో క్షేత్రస్థాయిలో పనిచేసిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. ఈ నిమజ్జన కార్యక్రమం విజయవంతం కావడంలో అందరి సహకారం ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు.