ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో సౌతాఫ్రికా ఘోర ఓటమి పాలైంది. 415 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి కేవలం 72 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 342 పరుగుల తేడాతో ఓటమిపాలైన సౌతాఫ్రికా, వన్డే చరిత్రలోనే అత్యధిక పరుగుల తేడాతో ఓడిన జట్టుగా చెత్తరికార్డు సృష్టించింది. ఇంగ్లండ్ బౌలర్ ఆర్చర్ 4 వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బ తీశాడు.