ప్రకాశం: త్రిపురాంతకం మండలం మేడపిలో ఆదివారం సాయంత్రం నూతి సుబ్బయ్య (45) అనే రైతు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందారు. గేదెలను బయటకు తోలేందుకు చెరువులోకి దిగిన ఆయన అందులోనే మునిగిపోయారు. దీంతో సమాచారం అందుకున్న ఎస్సై శివ బసవరాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.