ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ప్రారంభమైంది. తెల్లవారుజాము 1:26 గంటల వరకు గ్రహణం ఉండనుంది. ప్రజలు టెలిస్కోపుల్లో గ్రహణాన్ని వీక్షిస్తున్నారు. చంద్రుడు 82 నిమిషాలపాటు పూర్తిగా భూమి నీడనే ఉండనున్నాడు. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఉండనుంది. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పాక్షిక గ్రహణం ఉండనుంది. కాగా ఈ ఏడాదిలో ఇది మూడో గ్రహణం.