అన్నమయ్య: చిట్వేలి మండలం నేతివారిపల్లె ఎరుకుల కాలనీలో దాసరి ప్రశాంతి (25) అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతిచెందింది. వివరాల్లోకెళ్తే నెల్లూరు టౌన్‌కు చెందిన ప్రశాంతి సుమారు తొమ్మిది నెలల క్రితం రాజేష్‌తో వివాహం జరిగింది. ఈ మేరకు అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు చిట్వేలి పోలీసులు కేసు నమోదు చేశారు.