ప్రో కబడ్డీ సీజన్-12లో తెలుగు టైటాన్స్ తమ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. విశాఖపట్నంలోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్.. బెంగాల్ వారియర్స్పై 44-34 పాయింట్ల తేడాతో గెలుపొందింది. తెలుగు టైటాన్స్ విజయంలో ఆల్ రౌండర్ విజయ్ మాలిక్(11 పాయింట్లు), భరత్(12 పాయింట్లు) కీలక పాత్ర పోషించారు.