SRCL: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ,సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరిపై కేసు నమోదు అయింది. ఈ మేరకు బోయినపల్లి ఏస్సై మల్లేశం ఆదివారం వివరాలు తెలిపారు. మండలంకు చెందిన రాజిరెడ్డి, సంజీవరావులు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏఎంసీ ఛైర్మన్ బోయిని ఎల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.