HYD: బాలానగర్ వై జంక్షన్ వద్ద డ్రగ్స్ విక్రయాలపై అందిన సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. సంతోష్ యాదవ్ (43) అనే వ్యక్తి నుంచి 23.98 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.3 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడు గతంలోనూ కొకైన్‌తో పట్టుబడినట్లు పేర్కొన్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.