TG: కవయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవికి ఈ ఏడాది కాళోజీ పురస్కారం లభించింది. అందెశ్రీ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ పురస్కారాన్ని సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా రమాదేవికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.