భారత హాకీ జట్టు ఆసియా ఛాంపియన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాపై 4-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాడు దిల్‌ప్రీత్ సింగ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 2 గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ విజయంతో భారత్ 2026 హాకీ వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది.