KMR: బీసీ డిక్లరేషన్‌పై ఇచ్చిన హామీని నెరవేస్తున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. గవర్నర్ ఆమోదించకుండా కేంద్రానికి పంపి జాప్యం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయడానికి బీజేపీ నేతలు ఎందుకు వెనక్కి వెళ్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీసీలకు పెద్దపీట వేస్తోందన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.