ASR: గూడెం కొత్తవీధి మండలంలోని పెద్దవలస గ్రామ సమీపంలో 40 కేజీల గంజాయి పట్టుబడిందని ఎస్సై సురేష్ ఆదివారం తెలిపారు. ముందస్తు సమాచారంతో తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా బైక్పై తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని పేర్కొన్నారు. ఈమేరకు గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని గంజాయి తరలిస్తున్న నాతవరం మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు.