ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో వన్డేలో 415 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా జట్టు తీవ్రంగా తడబడుతుంది. ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరుగుతున్నాడు. దీంతో సౌతాఫ్రికా కేవలం 24 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆర్చర్ తన 5 ఓవర్లలో 5 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. మాక్రమ్(0), రికల్టన్(1), ముల్డర్ (0), మాథ్యూ (4), స్టబ్స్ (10) పెవిలియన్ చేరారు.