MNCL: గణేష్ నిమజ్జన మహోత్సవం సందర్భంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఆదివారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై మాజీ ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు చేశారని తెలిపారు.