PDPL: శ్రీశైలం, అహోబిలం, యాగంటి, మహానంది తీర్థయాత్రల కోసం గోదావరిఖని నుంచి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. ఈ నెల 17న గోదావరిఖని బస్టాండ్ నుంచి ఈ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందన్నారు. పెద్దలకు రూ.3,600, పిల్లలకు రూ.2,800 చార్జీ ఉంటుందని పేర్కొన్నారు.