WNP: పెబ్బేరు మండల శ్రీకృష్ణ యాదవ సంఘం నూతన అధ్యక్షుడిగా భగవంతు యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం పట్టణంలో జరిగిన సంఘం సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా భగవంతు యాదవ్ మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధి, ఐక్యత కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండల స్థాయిలో యాదవ సంఘం అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు.