ATP: జిల్లాలో యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. ఆదివారం రాప్తాడు మండలం అయ్యవారిపల్లి రోడ్లో ఉన్న మార్క్ ఫెడ్ స్టాక్ స్టోర్ గోడౌన్ను ఆయన తనిఖీ చేశారు. గోడౌన్లో నిల్వ ఉన్న యూరియాపై అధికారులతో ఆరా తీశారు. యూరియా పంపిణీలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.