RR: మహేశ్వరం నియోజకవర్గం, ఆర్కే పురం డివిజన్లోని వాసవి కాలనీలో జరిగిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో లడ్డూ వేలంపాట ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ వేలంలో రాజేంద్రప్రసాద్, కళ్యాణి దంపతులు రూ. 5,22,000లకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నిమజ్జన కమిటీ ఛైర్మన్ చిలుక ఉపేందర్ రెడ్డి వారిని సత్కరించారు.