SRCL: వేములవాడ పట్టణ పరిధిలో 43 కుల సంఘాలకు 2 కోట్లు 58 లక్షల నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం పత్రిక ప్రకటన ద్వారా వెల్లడించారు. కుల సంఘ భవనాలు ఆత్మగౌరవ ప్రతీకలుగా నిలుస్తాయని, ఇవి పలు సమస్యల పరిష్కారానికి వేదికగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.