KMM: వేంసూరు మండలం కల్లూరుగూడెం గ్రామంలో నూతన పామాయిల్ ఫ్యాక్టరి నిర్మాణ పనులను ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ పరిశీలించారు. అనంతరం ఫ్యాక్టరీ కాంట్రాక్టర్, సంబంధిత అధికారులతో నిర్మాణ పనుల పురోగతి వివరాలు తెలుసుకున్నారు. కాంట్రాక్టర్‌తో కల్లూరుగూడెంతో పాటు చుట్టూ ప్రక్కల గ్రామాల వారికి రోజు వారి ఉపాధి కల్పించాలని సూచించారు.