ADB: ఆదిలాబాద్ పట్టణంలోని పాత జాతీయ రహదారి పక్కన రైల్వే ప్రహారిగోడ వద్ద ఆదివారం స్థానికులు గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు శవాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. మృతుని వయస్సు 40-45 మద్య ఉండొచ్చని టూటౌన్ ఇన్స్పెక్టర్ కే.నాగరాజు తెలిపారు. నోట్లో నుంచి నురుగు రావటంతో పురుగుల మందు తాగి మృతి చెందవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.