KMM: కుంగింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు.. కుళ్లిపోయింది కాంగ్రెస్ వాళ్ళ కళ్ళు అని BRS రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి విమర్శించారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరమే కూలిపోతే మల్లన్నసాగర్లో నీళ్లు ఎక్కడివి అని ప్రశ్నించారు.