AP: విజయవాడ, విశాఖ మెట్రో టెండర్ల గడువును పొడిగిస్తూ ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 14 వరకు విజయవాడ, అక్టోబర్ 7 వరకు విశాఖ మెట్రో టెండర్ల గడువును పొడిగించారు. విశాఖలో ఫేజ్-1 కింద 46.3 కి.మీ తొలిదశ టెండర్లు, విజయవాడలోని ఫేజ్-1లో 38 కి.మీ మెట్రో నిర్మాణానికి టెండర్లను పిలిచారు.