KDP: సిద్దవటం మండలంలోని ఎస్.రాజంపేట సమీపంలో శనివారం రాత్రి అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వంతాటిపల్లె గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య అక్రమ మద్యం విక్రయిస్తుండగా అతని వద్ద 65 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం పట్టుబడిన మధ్య విలువ రూ. 10 వేలు ఉంటుందని SI తెలిపారు.