KMR: BC రిజర్వేషన్లు అమలయ్యాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని PCC చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బీసీ బిల్లు ఆమోదంపై BJP నేతల భాగోతాన్ని బయటపెట్టేందుకే KMRలో BC డిక్లరేషన్ అమలు సభ నిర్వహిస్తున్నామని అన్నారు. కామారెడ్డి పట్టణంలోని శుభం కన్వెన్షన్ హాలులో ఆదివారం నిర్వహించిన BC బిల్లు సభ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకుల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు.