ELR: ఆగిరిపల్లి మండలంలోని నెక్కలం గొల్లగూడెంలో ఉన్న ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హనుమాన్ ఏజెన్సీలో రూ.2.75 లక్షల విలువైన 12.65 టన్నుల కాంప్లెక్స్, సూపర్ ఎరువుల నిల్వల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ దుకాణాన్ని సీజ్ చేసి, యజమానిపై కేసు నమోదు చేశారు.