కృష్ణా: జిల్లా కలెక్టర్ డీకే.బాలాజీ ఆదివారం గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. రైతులతో నేరుగా మాట్లాడి యూరియా సరఫరా పరిస్థితులపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. యూరియా సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని రైతులకు ఆయన స్పష్టం చేశారు.