NLR: రైతు సమస్యలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం కందుకూరు కలెక్టరేట్ వద్ద ‘అన్నదాత పోరు’ కార్యక్రమం నిర్వహించనున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జరగనుంది. వైసిపి పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.