గుంటూరులోని పుచ్చలపల్లి సుందరయ్య నగర్లో ఇవాళ పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అపర్ణ, సీపీఎం నాయకులు నళినీకాంత్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వయసు పైబడిన వారు ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు తెలిపారు.