ELR: రంపచోడవరం కేంద్రంగా మరొక ఆదివాసి జిల్లాను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ ఛైర్మన్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుట్టాయగూడెం మండలం మర్రిగూడెంలో ఆదివారం జరిగిన ఆదివాసి జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న రెండు మన్యం జిల్లాలతో పాటు రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు చేయాలన్నారు.