ADB: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగా దళితుడు సొగల సుదర్శన్ పేరు పొందడం హర్షణీయమని భారతీయ బౌద్ధ మహా సభ సభ్యులు అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ మహాప్రజ్ఞ బుద్ధవిహార్లో ఆయన్ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులకు చదువులపై ఆసక్తి చూపించి, ఉన్నత విద్య బోధించాలని వారు పేర్కొన్నారు.