VKB: వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే పెన్షన్లు పెంచి న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకుడు ఆనంద్ మాదిగ పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెన్షన్ల కోసం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సోమవారం పెన్షన్లు పెంచాలని ఛలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు.