SRPT: కోదాడలో మీలాద్-ఉన్-నబీ మహోత్సవాన్ని పురస్కరించుకుని యునైటెడ్ ముస్లిం కోదాడ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. తలసెమియా బాధితులకు రక్తం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో సుమారు 80 మంది యువతీయువకులు రక్తదానం చేశారు. ఈ సామాజిక సేవను స్థానిక ప్రజలు ప్రశంసించారు.