ADB: బ్యాంక్ మేనేజర్ గ్రామీణ ప్రజల ఆర్థిక అభివృద్ధికి అందించిన సహకారం మరువలేనిది అంకోలి మాజీ సర్పంచ్ భూమన్న పేర్కొన్నారు. రూరల్ మండలంలోని అంకొలి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర్లు సేవలను గుర్తించి బదిలీపై వెళుతున్న ఆయనను ఆదివారం సన్మానించారు. స్థానికంగా ఉన్న బ్యాంక్ ఇతర ప్రాంతానికి తరలి పోకుండా మేనేజర్ చేసిన కృషిని కొనియాడారు.