NLR: సీతారాంపురం(M) మారంరెడ్డిపల్లి సొసైటీ అధ్యక్షుడు సోమనబోయిన రాజశేఖర్ ఆదివారం ఉదయగిరి MLA కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. మునిపెన్నడు లేని విధంగా సొసైటీ అభివృద్దికి కృషి చేస్తానని రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. నూతనంగా ఎన్నికైన సొసైటీ సభ్యులు రైతుల సంక్షేమాన్ని కృషి చేయాలని MLA సూచించారు.