TPT: శ్రీకాకుళం నుంచి వచ్చిన అరుణ, అన్నపూర్ణమ్మ శ్రీవారి, అమ్మవారి దర్శనానంతరం తిరుచానూరు పల్లెవెలుగు బస్సులో హడావిడిలో తమ లగేజీ సంచులు మరిచి దిగారు. ఈ మేరకు ఏడుకొండల బస్ స్టేషన్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కృష్ణకు సమాచారం ఇవ్వగా, కండక్టర్ లత, డ్రైవర్ బుచ్చిబాబు, సెక్యూరిటీ సిబ్బంది చాకచక్యంతో సంచులు వెతికి భద్రంగా అప్పగించారు. అనంతరం భక్తులు కృతజ్ఞతలు తెపిపారు.