KMM: పార్టీ బలోపేతం, మహిళా కాంగ్రెస్ బలోపేతం, కార్య కర్తల చైతన్యం పెంపొందించడం మనందరి లక్ష్యమని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శైలజ రెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సమావేశంలో జనరల్ సెక్రటరీ రామాదేవి,సెక్రటరీ పావని తదితరులు పాల్గొన్నారు.