దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 414 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ (100), జాకబ్ బెథెల్ (110) సెంచరీలతో అదరగొట్టారు. ఓపెనర్ జేమీ స్మిత్ (62), చివర్లో బట్లర్ (32 బంతుల్లో 62) దంచికొట్టారు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.