VZM: మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ గత 5 ఏళ్లలో జరిగిన అవినీతి గురించి మాట్లాడాలంటూ జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. విలువలకు నిబద్ధతకు మారు పేరైన గవర్నర్ అశోక్ గజపతిరాజును మెంటల్ హాస్పిటల్లో పెట్టాలి అంటారా? ఇది పద్ధతా? ఇది సంస్కృతా? ఇది మీ స్థాయిని చూపించే మాటలు కాదా? అని ప్రశ్నించారు.