KMM: వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించి, రైతులను కూలీలుగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండపర్తి గోవిందరావు ఆరోపించారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశీయ సంస్థల మాదిరిగానే వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.