కోనసీమ: ఇటీవల విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బోధిధర్మ అవార్డుకు ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామానికి చెందిన కుంగ్ ఫూ మాస్టర్ సత్తిబాబు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ మేరకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వాడపాలెంలో ఆదివారం బోధిధర్మ అవార్డు గ్రహీత సత్తిబాబును అభినందించి, ఘనంగా సత్కరించారు.